విడిపోయినా సరే భార్య ఖర్చులు భరించాల్సిందే: కోర్ట్ తీర్పు

-

అలహాబాద్ హైకోర్ట్ కీలక తీర్పు ఇచ్చింది. ఒక పురుషుడు తన భార్యతో విడిపోయిన తర్వాత కూడా వారికి నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది. కుటుంబ భారం మోయడం అనేది ఒక వ్యక్తి చట్టపరమైన, నైతిక, సామాజిక బాధ్యత మరియు నిబద్ధత అని హైకోర్టు తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది. తల్లి తండ్రులతో కలిసి భార్య నివసిస్తున్న నేపధ్యంలో ఆమెకు నిర్వహణ ఖర్చు ఇవ్వడానికి ఆమె భర్త నిరాకరించాడు.

దీనితో అతని భార్య ఫ్యామిలీ కోర్ట్ లో పిటీషన్ దాఖలు చేయగా విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది. భర్త దాఖలు చేసిన పిటీషన్ ని కోర్ట్ కొట్టివేసింది. “భారతీయ సమాజంలో వివాహం ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. తల్లిదండ్రులు తమ కుమార్తెకు తన అత్తగారు నుండి ఎక్కువ ప్రేమను లభిస్తుంది అని కలలు కంటారు. అయినప్పటికీ, వారి కుమార్తె వేధింపులకు గురవుతుంది.

దీనితో తల్లిదండ్రుల కల చెదిరిపోవడమే కాకుండా… వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని కోర్టు తెలిపింది. భార్య తల్లి తండ్రులను వదిలి భర్త వద్దకు వచ్చినప్పుడు ఆమెను బాగా చూసుకోవడం భర్త నైతిక, చట్టపరమైన బాధ్యత అని భార్య మరియు కుమార్తెకు నిర్వహణ ఖర్చులకు నెలకు రూ .3500 చెల్లించాలని భర్తను కోర్ట్ ఆదేశించింది. అశ్వని యాదవ్ అనే వ్యక్తి… 29 సెప్టెంబర్ 2015 న జ్యోతి యాదవ్‌ ను వివాహం వివాహం చేసుకోగా… వివాహం కోసం మొత్తం రూ .15 లక్షల రూపాయలు ఖర్చు చేసినా సరే కట్నం కోసం తన అత్తగారు వేధింపులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసారు.

దీనితో జనవరి 28, 2019 న జ్యోతి తన తల్లిదండ్రులతో కలిసి బ్రతకడానికి పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత నిర్వహణ ఖర్చులు భారంగా మారడంతో కోర్ట్ కి వెళ్ళగా భార్యకు నెలవారీ భాత్యంగా 2500 కుమార్తెకు రూ .1000 ఇవ్వాలని ఆదేశించింది కోర్ట్.

Read more RELATED
Recommended to you

Latest news