వైఎస్ స్నేహితుడి పై వైసీపీ నేతల ఫైర్ అందుకేనా…!

-

రాజకీయ మేధావి వైఎస్ కు అత్యంత సన్నిహితుడు..జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వారిలో ఆయన ఒకరు..నిన్నటి వరకు ప్రభుత్వానికి సలహాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు జగన్ సర్కార్ కి వార్నింగ్ ఇచ్చారు. తాజాగా పోలవరం వ్యవహారంలో జగన్ పై చేసిన వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో అలజడి రేపాయి. ఆయన పంచ్ లు వేస్తే ఎప్పుడూ ప్రత్యర్ధుల నుండి కౌంటర్ ఏటాక్ ఉండదు. కానీ ఆయన సొంతం నియోజకవర్గం నుండి అతని శిష్యులే కౌంటర్ ఏటాక్ చేయడం ఆసక్తిగా మారింది.

జగన్ ముఖ్యమంత్రి అవ్వాల్సిందే అని కోరుకున్న వారిలో రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ముందువరసలో ఉండేవారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిని సిఎంగా చూడాలనే తన కోరిక తీరినందుకు సంతోషిస్తూ పలు సూచనలు సైతం చేశారు. అయితే జగన్ పరిపాలన ఏడాది దాటిన తర్వాత ఉండవల్లి స్వరంలో వైసిపి ప్రభుత్వానికి వార్నింగ్ మొదలైంది. గతంలో టిడిపికి చెందిన వారే ఉండవల్లి వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చేందుకు జంకే పరిస్థితి ఉండేది. కానీ వైసీపీ నేతలు సడన్ గా ఉండవల్లి పై ఫైర్ అయ్యారు.

ఉండవల్లి శిష్యుడిగా పేరొందిన ఏ.పి. ఐ.ఐ.సి మాజీ చైర్మన్ శ్రిఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం, ఎంపి మార్గాని భరత్ ఉండవల్లి పై ఫైర్ అయ్యారు. పోలవరం అంశంపై ప్రధానికి జగన్ లేఖ రాశారు. బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. దీంతో వైసిపి నేతలు ఉండవల్లిపై మరింత దూకుడు పెంచారు.

తాజాగా ఉండవల్లి చేసిన వ్యాఖ్యల్లో సి.ఎం జగన్ కేసుల విషయాన్ని సైతం ప్రస్తావించారు…ఆరు నెలలు మించి జైలుశిక్షపడదనీ… పోలవరం వ్యవహారంపై కేంద్రంతో పోరాడితే జగన్ మనిషే మళ్లీ సిఎం అవుతారని అనడం వైసీపీ నేతలకు ఆగ్రహం తెప్పించినట్లుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news