దేశంలో ఈ పది రాష్ట్రాలే వరస్ట్: కేంద్రం

-

దేశంలో కరోనా వైరస్ కేసులలో పది రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ కి వెల్లడించింది. 10 రాష్ట్రాలలో దాదాపు 77 శాతం కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, హర్యానా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలే ముందు వరుసలో ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలో యాక్టివ్ కేసులు మహారాష్ట్రలో 18.9 శాతం ఉండగా… కేరళ మరియు ఢిల్లీలో 14.7 శాతం మరియు 8.5 శాతం గా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ మరియు కర్ణాటకలో 5.7 శాతం, 5.6 శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్రం చెప్పింది. భారతదేశం రోజుకు సగటున 1.1 మిలియన్ నమూనాలను పరీక్షిస్తోందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news