కాస్త ఊపిరి పీల్చుకున్న ఆటో మొబైల్ రంగం…!

-

కరోనా సమయంలో గత కొన్ని రోజుల నుంచి పడిపోయిన వాహనాల రిజిస్ట్రేషన్ ఆగస్ట్ నెలలో కాస్త మెరుగు పడిందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గాయి. బుధవారం ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) 2020 ఆగస్టు నెలకు నెలవారీ వాహనాల రిజిస్ట్రేషన్ డేటాను విడుదల చేసింది. కొన్ని పండగల కారణంగా ఆగస్టులో వాహనాల రిజిస్ట్రేషన్లు మెరుగుపడుతున్నాయని నివేదిక పేర్కొంది.

ఏడాది ప్రాతిపదికన చూస్తే 26.81% తగ్గాయని ఫాడా పేర్కొంది. వార్షిక లెక్కల ప్రకారం చూస్తే , టూ వీలర్ విభాగం -28.71%, త్రీ – వీలర్ -69.51%, సివి -57.39%, మరియు పివి -7.12% క్షీణించాయి అని లెక్కలు చెప్పాయి. ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ 27.80% వృద్ధి సాధించింది. జన్మాష్టమి మరియు గణేష్ చతుర్థిల కారణంగా వాహనాలను కాస్త కొనుగోలు చేసారని లెక్కలు చెప్పాయి. టూ వీలర్ల కోసం జిఎస్‌టిపై ప్రభుత్వం తగ్గింపు కోసం ఎదురుచూస్తున్నామని ఫాడా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version