రాజీవ్ గాంధీ హత్య కేసు దోషి ఎజి పెరరివళన్‌కు మద్రాస్ హైకోర్టు 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. కొన్ని నెలల క్రితం అతని తల్లి అర్పుతమ్మల్ తన కుమారుడి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు మరియు అతని తోటి జైలు ఖైదీలు చాలా మంది కరోనా బారిన పడటంతో పెరోల్ ఇవ్వాలని కోర్ట్ ని ఆశ్రయించారు. అతని చికిత్స కోసం 90 రోజుల పెరోల్ కోరింది మరియు అతని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను కోర్ట్ ముందు ఉంచారు.
జైలు నిబంధనలలో లభించే మినహాయింపు కింద ఇంతకుముందు పెరోల్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ, అతనికి పెరోల్ మంజూరు చేయాలని డివిజన్ బెంచ్ ఆఫ్ జస్టిస్ ఎన్ కిరుబకరన్ మరియు జస్టిస్ పి వెల్మురుగన్ ఆదేశించారు. రాజీవ్ గాంధీని చంపిన బాంబులో ఉపయోగించిన రెండు 9-వోల్ట్ ల బ్యాటరీలను అందించిన కారణంతో 1991 లో పెరరివలన్ ని దోషిగా పేర్కొన్నారు. అయితే అతనికి ఆ బ్యాటరీలు ఎందుకు వాడారో తర్వాత తెలిసింది.