జాతీయ ఓటర్ల నమోదు దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ఓ వినూత్న ప్రయోగాన్ని ప్రారంభించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అమెరికన్ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. మంగళవారం అమెరికా జాతీయ ఓటర్ల నమోదు దినోత్సవం సందర్భంగా @TwitterGov పేరుతో ట్విట్టర్ ఖాతాను తెరిచింది.
ఈ ఖాతా ద్వారా దేశానికి సంబంధించిన రాజకీయ పరిస్థితులు, నిబంధనల గురించి పూర్తి సమాచారాన్ని అందిస్తోందని ట్విట్టర్ పేర్కొంది. ప్రజల్లో అవగాహన పెంచి దేశ మార్పుకు సహాయపడే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని సంస్థ వెల్లడించింది. అయితే ఈ ఖాతాలో 40 భాషల్లో అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు తమకు నచ్చిన భాషను ఎంచుకుని సమాచారాన్ని పొందవచ్చన్నారు. ప్రముఖ నాయకులు, కీలక వ్యక్తుల ఖాతాలు భద్రపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ట్విటర్ తెలిపింది. ట్విట్టర్ ను వాడుతున్న పది శాతం మందిలో తొమ్మిది శాతం మంది నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఎన్నికల్లో ఓటు వేసే విధానానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని ట్విట్టర్ తెలిపింది.