ఒమీక్రాన్ ఎఫెక్ట్ తో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్…!

-

కోవిడ్ 19 కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ ని కల్పించాలని అనుకుంటోంది. ఈ మేరకు సగం మంది సిబ్బంది ఇంటి వద్ద నుంచే పని చేయొచ్చని అంది. కార్యదర్శి ర్యాంక్‌కు దిగువున వారికి ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని తెలిపింది కేంద్రం.

వికలాంగులు, ప్రెగ్నెంట్ మహిళలు ఆఫీస్‌లకు రావాల్సిన పని లేదని కేంద్రం అంది. అదే విదంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు కార్యాలయాల్లో రద్దీని నివారించడానికి అవసరమైన టైమ్ టేబుల్ ని నిర్వహించాలని అంది. సెక్రటరీ స్థాయి దిగువున ఉద్యోగులకు ఫిజికల్ అటెండెన్స్‌ను 50 శాతానికి తగ్గించామని…తక్కిన వాళ్లు ఇంటి నుండే పని చెయ్యచ్చని అంది.

అలానే కోవిడ్ కంటైన్మెంట్ జోన్లలో నివసించే ఉద్యోగులు ఆఫీస్ కి రావక్కర్లేదని అంది. కంటైన్మెంట్ జోన్లను డీనోటిఫై చేసిన తర్వాత వీరి ఆఫీస్‌కు రావొచ్చని కేంద్రం తెలిపింది. కేంద్ర భుత్వ డిపార్ట్‌మెంట్లు అన్నింటికీ ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి.

జనవరి 31 వరకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తొలగిస్తున్నట్టు కూడా తెలిపింది. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం కేంద్రం తీసుకుంది. అటెండెన్స్ రిజిస్టర్‌లో అటెండెన్స్ వేయించుకోవాలని సూచించింది. భద్రత కోసం ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేంద్ర మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news