టాపర్ జీవితాన్ని తలకిందులు చేసిన ఒక్క చిన్న లింక్..!

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని చాల సార్లు విన్నాం. కానీ నేటి సమాజంలో ఒక్క లింక్ టాప్ జీవితాన్నే తలకిందులు చేసింది. అతడికి నా అంటూ వాళ్ళు ఎవరు లేరు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాడు. రెండేళ్ల క్రితం తల్లి కూడా మరణించింది. అతడి వయస్సు 18 ఏళ్లు. ఇప్పుడు అతడు అనాథ. అయితేనేం..తనకు చదువుల తల్లి తోడుగా ఉందని భావించాడు. సమాజంలో మంచి స్థాయిలో ఉండాలని కసితో చదివాడు. జెఈఈలో అఖిల భారత ర్యాంకు 270 సాధించాడు.

Wrong-Click

అతడికి వచ్చిన ర్యాంక్ కి ఐఐటి-బొంబాయిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బిటెక్ కోర్సులో సీటు పొందాడు. అయితే అతడు సీటు సాధించిన రెండు వారాల్లోనే దాన్ని కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్తే… ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బాత్రా, ఐఐటి-జెఈఈ (అడ్వాన్స్‌డ్) 2020 ను ర్యాంకు సాధించి, అక్టోబర్ 18 న రౌండ్ వన్‌లో ముందుకెళ్లాడు. అక్టోబర్ 31 న, అతను తన రోల్ నంబర్‌పై అప్ డేట్స్ కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో సీటు ఉపసంహరణ బటన్‌పై అతను అనుకోకుండా క్లిక్ చేశాడు. తీరా చూస్తే.. నవంబర్ 10 న ప్రవేశం పొందిన విద్యార్థుల జాబితాలో అతని పేరు లేదు. ఇక ఉపసంహరణ లేఖకు వ్యతిరేకంగా పోరాడటానికి అతను బొంబాయి హైకోర్టును ఆశ్రయించాడు.

అయితే నవంబర్ 19న ధర్మాసనం తన పిటిషన్‌ను 2 రోజుల్లోపు రిప్రజెంటేషన్‌గా పరిగణించాలని ఐఐటికి ఆదేశించింది. అయితే ఐఐటి రిజిస్ట్రార్ ఆర్ ప్రేమ్‌కుమార్ ఉపసంహరణ లేఖను రద్దు చేసే అధికారం తమకు లేదని పేర్కొన్నారు. తన కోసం అదనపు సీటును కేటాయించాలని బాత్రా సుప్రీంకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం బాత్రా తన మామయ్య, అమ్మమ్మ కలిసి నివసిస్తున్నాడు. ఈ కేసును సుప్రీంకోర్టు డిసెంబర్ 1న విచారణ చేయనుంది.