తెలుగు సినిమా ఇండస్ట్రీలో నార్త్ హీరోయిన్స్‌కే డిమాండ్ ఎక్కువ. బొంబాయి బ్యూటీస్‌కి మాత్రమే భారీ ఆఫర్స్ వస్తాయనే కామెంట్స్‌ని చెరిపేస్తున్నారు కొంతమంది సౌత్ హీరోయిన్స్. పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా ఎక్కడ చూసినా దక్షిణాది అమ్మాయిలే కనిపిస్తున్నారు. నార్త్ హీరోయిన్స్‌కి చెక్ పెడుతున్నారు.
తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్లు తగ్గిపోయాక బొంబాయి హీరోయిన్స్ హవా ఎక్కువైంది. నగ్మా లాంటి నార్త్ బ్యూటీస్ హంగామా చేశారు. ఈ మధ్య కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లు స్టార్డమ్ చెలాయించారు. అయితే ఇప్పుడీ నార్త్ గర్ల్‌కి చెక్ పెట్టేస్తున్నారు దక్షిణాది హీరోయిన్లు.
కొన్నాళ్ల క్రితం వరకు బెంగళూరు బ్యూటీ అనుష్క, చెన్నై అందం సమంత టాప్ ఛైర్‌ని రూల్ చేశారు. అయితే ఇప్పుడు ఇద్దరు కర్నాటక అమ్మాయిలు నంబర్ వన్ అనిపించుకోవడానికి ఫైటింగులు చేస్తున్నారు. పూజా హెగ్డే, రష్మిక మందన్న క్రేజీ ఆఫర్స్ అందుకుంటూ, టాప్ ఛైర్‌కి దగ్గరవుతున్నారు.
పూజా హెగ్డే, రష్మిక మందన్న టాలీవుడ్‌ని కంప్లీట్‌గా డామినేట్ చేస్తున్నారు. మరో హీరోయిన్‌కి ఛాన్స్ ఇవ్వకుండా వీళ్లిద్దరే స్టార్స్‌ని, యంగ్‌స్టర్స్‌నీ కవర్ చేస్తున్నారు. పూజ ఒకవైడు ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చేస్తూనే, కుర్రాడు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తోంది. ఇక రష్మిక అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ చేస్తోంది. అలాగే శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనిపిస్తోంది. వీళ్లతోపాటు మళయాళీ లేడీ కీర్తీ సురేశ్ కూడా స్టార్లని, కుర్రాళ్లని కవర్ చేస్తోంది.
మీడియం రేంజ్ సినిమాలని కూడా నార్త్ లేడీస్‌కి విడిచిపెట్టట్లేదు సౌత్ హీరోయిన్లు. తమిళ బ్యూటీ సాయి పల్లవి, మల్లూ బేబీస్ నివేదా థామస్, అనుపమ పరమేశ్వర్ మీడియం రేంజ్ మూవీస్‌కి ఫస్ట్ ఆప్షన్‌గా మారుతున్నారు. దీంతో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా లాంటి వాళ్లు తెలుగు ఇండస్ట్రీని విడిచిపెట్టి మరో వుడ్‌ని చూసుకుంటున్నారు.
తెలుగు మేకర్స్ సౌత్ హీరోయిన్స్‌ని బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు గానీ, తెలుగు అమ్మాయిలని ప్రోత్సాహించట్లేదని కామెంట్స్ మాత్రం ఆగట్లేదు. మరి బొంబాయ్ క్రేజ్ నుంచి బయటపడ్డ దర్శకనిర్మాతలు, హీరోలు తెలుగు అమ్మాయిలని తీసుకోవడానికి ఇంకెంత టైమ్ తీసుకుంటారో చూడాలి.