యాషెస్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఇంగ‌్లండ్ పై ఆసీస్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ యాషెస్ సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ఇవాళ రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.
ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికగా మ.3.30 గంటలకు ఇరుజట్లు తలపడనున్నాయి. తొలి టెస్ట్ లో విజయం సాధించిన ఆసీస్ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా… ఈ టెస్ట్ లో గెలిచి సిరిస్ సమం చేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. కాగా, ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఇవాళ వందో టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాడు.