ఈ ఏడాది సాధారణం కన్నా ఎక్కువ వానలు : ఐఎండీ

-

ఈ ఏడాది నైరుతి రుతు పవనాల సీజన్‌ (జూన్‌ – సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఆగస్టు – సెప్టెంబరు మధ్యలో లా నినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం (1970 – 2020) 87 సెంటీ మీటర్లు కాగా,  ఈ ఏడాది 106 శాతం అధికంగా (సుమారు 92 సెం.మీ.) వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపారు.

దశాబ్ద కాలంలో ఐఎండీ వార్షిక తొలిదశ అంచనాల్లోనే సాధారణం కన్నా అధిక వర్షపాతాన్ని ప్రకటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితులు బలహీన పడుతున్నాయని అధికారులు తెలిపారు. నైరుతి ప్రారంభం నాటికి వాటి ప్రభావం మరింత తగ్గుముఖం పడుతుందని వెల్లడించారు. సాధారణ వర్షపాతానికి 29 శాతం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతానికి 31 శాతం, అధిక వర్షపాతానికి 30 శాతం అవకాశమున్నట్లు ఐఎండీ వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news