పశ్చిమ బెంగాల్ లో సందేశా ఖాలీ కేసులో ప్రధాన నిందితుడైన షేక్ షాజహన్ ఖాన్పై తృణమూల్ కాంగ్రెస్ వేటు వేసింది. టీఎంసీ పార్టీకి సంబంధించిన అన్ని పదువుల నుంచి షాజహన్ ఖాన్ ను సస్పెండ్ చేసింది. ఈ సస్పెన్షన్ ఆరేళ్లు కొనసాగుతుందని టీఎంసీ పార్టీ వెల్లడించింది. సందేశ్ ఖాలీ
కేసులో షాజహన్ ఖాన్ పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లో టీఎంసీ ఆయన్ను సస్పెండ్ చేసింది.
పరారీలో ఉన్న షాజహాన్ ఖాన్ ఎట్టకేలకు పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేశారు. సందేశ్ ఖాలీలోని
భూములు లాక్కొని.. అక్కడి మహిళలపై లైగింక దాడులకు పాల్పడినట్లు షాజహన్ ఖాన్ తో ఆయన అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రోజులు సందేశ్ ఖాలీ గిరిజన మహిళలు షాజహన్ ఖాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికలు సమయంలో ఈ నిరసనలు పశ్చిమ బెంగాల్లో రాజకీయల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటి వరకు స్పందించని టీఎంసీ.. నిన్న ప్రధానిమోదీ బెంగాల్ పర్యటన అనంతరం తమ నేత అరెస్ట్ కావటం ఆవెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం.