దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత దాదాపుగా ఆన్లైన్ క్లాసులను ఎక్కువగా నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం నాశనం కాకుండా ఉండటానికి గానూ ఆన్లైన్ క్లాసులను ఎక్కువగా దేశంలో నిర్వహించే పరిస్థితి ఉంది. విద్యార్ధులు కూడా దాని వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ విధంగా సౌకర్యాలు కనపడటం లేదు. దీనిపై విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఒక విద్యార్ధి ఆన్లైన్ క్లాసుల కోసం ప్రాణాలు తీసుకోవడం విషాదంగా మారింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయి గురి జిల్లాలో 20 ఏళ్ల కళాశాల విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మరణించారని పోలీసులు పేర్కొన్నారు. ఆన్‌లైన్ తరగతులకు హాజరు కావడానికి స్మార్ట్ ఫోన్ కొనలేదని కలత చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు వివరించారు.