ఉత్తర ప్రదేశ్ తో సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగ ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం 7 విడతల్లో జరుగుతున్నాయి. అందులో 6 విడతల ఎన్నికలు ఇప్పటికే జరిగాయి. నేడు 7వ విడత పోలింగ్ జరగనుంది. ఈ 7 వ విడత పోలింగ్ లో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 9 జిల్లాల పరిధిలో గల 54 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి.
]ఈ 7వ విడతలో 613 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే ఈ విడతలో దాదాపు 2.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కానుంది. అలాగే సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కాగ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 6 విడతలలో ఎన్నికలు జరిగాయి.
నేడు జరిగే 7 విడతతో పోలింగ్ ప్రక్రియా ముగియనుంది. దీంతో ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 10 వ తేదీ జరగనుంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కూడా మార్చి 10వ తేదీనే వెలువడుతాయి.