టమాట భారత్‌లో మంట పెడుతోంది. రోజురోజుకు ఈ కూరగాయ ధరలు సామాన్యులకు గాయం చేస్తున్నాయి. గత నెలలో టమాట ధర 326.13 శాతం పెరిగినట్టు ప్రభుత్వ అంచనా. తాజాగా టమాటాల అమ్మకంతో కర్ణాటకలోని ఓ రైతు ఒక్కరోజులోనే లక్షాధికారి అయ్యాడు. 24 గంటల్లో టమాటాలు అమ్మి రూ.38 లక్షలు సంపాదించాడు. కోలార్ జిల్లాకు చెందిన ఓ రైతు కుటుంబం మంగళవారం 2 వేల బాక్స్‌ల టామాటాను మార్కెట్‌లో అమ్మగా.. బాక్స్‌కు రూ.1,900 చొప్పున రూ.38 లక్షలు వచ్చాయట. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడికి కోలార్ జిల్లాలోని బేథమంగళలో 40 ఎకరాల పొలం ఉంది. మంగళవారం రోజున 15 కేజీల బాక్స్ రికార్డు స్థాయిలో రూ.1,900 పలికింది. చింతామణి తాలూకాలోని వైజకూర్ గ్రామానికి చెందిన వెంకట రమణా రెడ్డి 15 కేజీల బాక్స్‌ను రూ.2,200కు అమ్మారు. 54 బాక్స్‌లను కోలార్ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చానని ఆయన తెలిపారు.