TSPSC పై బొత్స సంచలన వ్యాఖ్యలు..పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితిలో తెలంగాణ !

-

TSPSC పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ట్రాల్ సర్వీస్ కమిషన్ పరీక్షలనే నిర్వహించుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు బొత్స సత్య నారాయణ. తెలంగాణ సర్వీస్ కమిషన్ పరీక్షల్లోనే ఏ రకంగా స్కాం‌లు జరిగాయో చూశామని.. అన్ని చూచిరాతలే అంటూ ఫైర్‌ అయ్యారు.

ఎంత మంది అరెస్టులు అవుతున్నారో వార్తలు వస్తూనే ఉన్నాయని..టీచర్ల బదిలీలే చేసుకోలేని పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు. అందుకే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రంతో పోల్చకూడదని.. ఎవరి ఆలోచన వారిది, ఎవరి విధానం వారిదని తెలిపారు బొత్స సత్యనారాయణ.

అటు..నిన్న తాడెపల్లి గూడెంలో పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. ముందు వాలంటీర్ల విధివిధానాలు ఏంటో పవన్ కళ్యాణ్ కు తెలుసా? పవన్ కళ్యాణ్ ఆడపిల్లల పై అసభ్యకరంగా మాట్లాడటం కరెక్టా?? అది తగునా? అని ఫైర్‌ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థ కు దేశంలోనే అద్భుతమైన వ్యవస్థ గా గుర్తింపు పొందిందని.. దీని వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందనే దుర్బుద్ధితో ఆరోపణలు అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news