దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాట, మిర్చి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక టమాట ధరలు రోజురోజుకు నింగినంటుతున్నాయి. ముంబయి వంటి పలు నగరాల్లో కిలో టమాట ధర రూ.160 పలుకుతోంది. అత్యధికంగా యూపీలోని షాజహాన్‌పూర్‌లో అత్యధికంగా కిలో ధర రూ.162గా ఉంది.
ఇక ఉత్తరాఖండ్‌లో టమాట ధర ఏకంగా రూ.250కి చేరింది. ఉత్తరకాశి జిల్లాలో రూ.180 నుంచి రూ.200 పలుకుతోంది. దేశవ్యాప్తంగా సగటు ధర రూ.120 దాటింది. కోల్‌కతాలో రూ.152, దిల్లీలో రూ.120, చెన్నైలో రూ.117గా .. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో రూ.31గా ఉంది.
మరోవైపు ధరల విషయంలో తామేమీ తీసిపోలేదని అల్లం, వంకాయ .. టమాటాతో పోటీపడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 పలుకుతున్నది. లక్నో, దిల్లీలో వారం రోజుల వ్యవధిలోనే అల్లం ధర రూ.100 నుంచి రూ.250కి చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు.