హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో వరదలు వెళ్ళు వెత్తాయి. మెరుపు వరదల వల్ల గ్రాంఫు, చోటా ధర్రా గ్రామాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. సుమదో ఖాజా-గ్రాంఫ్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియలు విరిగి పడటంతో రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.
అయితే.. తాజాగా ఉత్తరాఖండ్ లో విషాదం చోటు చేసుకుంది.. ఉత్తరాఖండ్ లోని తెహ్రి జిల్లా గులార్ వద్ద నదిలో పర్యాటకుల వాహనం బోల్తా పడింది. వర్షాల కారణంగా విరిగిపడిన కొండచరియలను తప్పించబోయి నదిలోకి దూసుకెళ్లింది. వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందం రక్షించింది. మరణించిన వారు ఏపీకి చెందిన వారు ఉన్నట్లు సమాచారం అందుతోంది.