మీరు రైలు ప్రయాణం చేస్తున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అదేంటంటే.. రైల్వే శాఖ రైళ్ల కొత్త టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. రైల్వే అధికారిక వెబ్‌సైట్లోనూ ఈ వివరాలు లభ్యమవుతాయని తెలిపింది. మరి రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త టైం టేబుల్ గురించి తెలుసుకోవాలంటే వెబ్‌సైట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈ నూతన టైం టేబుల్లో రైల్వే శాఖ అధఇకారులు 64 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు, మరో 70 ఇతర రైళ్ల సేవలను చేర్చారు. వివిధ నగరాల మధ్య అనుసంధానాన్ని పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించేలా సమయ పట్టికను రూపొందించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 90 రైళ్ల గమ్యస్థానాలను మార్చడం, 12 రైళ్లు నడిచే రోజులను పెంచడం, 22 రైళ్లను సూపర్‌ఫాస్ట్‌లుగా నడపనుండడం వల్ల రాకపోకల సమయాలను ప్రయాణికులు ముందుగా సరిచూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.