త్రిపుర సీఎంగా బిప్లవ్ కుమార్ దేబ్ రాజీనామా…

-

బీజేపీ అధిష్టానం త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేబ్ పై వేటు వేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్యకు అందించారు. బీజేపీ అధిష్టానం హఠాత్తుగా సీఎం బిప్లవ్ ను తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. కేంద్రం నుంచి త్రిపుర రాజకీయాలను పరిశీలించేందుకు దూతగా కేంద్రమంత్రి, బీజేపీ నేత భూపేందర్ యాదవ్ ను పంపారు. 

రాత్రి 8 గంటలకు త్రిపుర శాసనసభా పక్షం సమావేశం జరుగనుంది.  ఈ సమావేశంలో కొత్త సీఎం ఎవరనేది తెలియనుంది. సభ్యులు కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. బిప్లవ్ దేవ్ నాయకత్వంలో గత 4 ఏళ్లలో రాష్ట్రంలో చాలా డెవలప్మెంట్ జరిగిందని..భూపేందర్ యాదవ్ అన్నారు. కాగా మరో ఏడాదిలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో రాజకీయ ఎత్తుగడలో భాగంగానే బీజేపీ త్రిపుర సీఎంను మార్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఉత్తరాఖండ్ సీఎంను మార్చి చివరి ఏడాది పుష్కర్ సింగ్ ధామికి పగ్గాలు అప్పగించి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని బీజేపీ మళ్లీ కైవసం చేసుకుంది. ఉత్తరాఖండ్ స్ట్రాటజీనే త్రిపురలో బీజేపీ పాటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news