స్టాలిన్​పై చర్యలు తీసుకోవాలని.. సుప్రీంకోర్టుకు 262 మంది ప్రముఖుల లేఖ

-

తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్​ సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. చాలా మంది నేతలు, ప్రముఖులు స్టాలిన్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇక తాజాగా స్టాలిన్​పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు మాజీ న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు సహా మొత్తం 262 మంది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు.

దేశంలో అత్యధిక శాతం జనాభా ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడారని వారు లేఖలోపేర్కొన్నారు. అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన స్టాలిన్.. కనీసం క్షమాపణ చేప్పేందుకు కూడా ఒప్పుకోలేదని ఆరోపించారు. అతి తీవ్రమైన అంశాల్లో చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తే.. అది కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని లేఖలో పేర్కొన్నారు.

స్టాలిన్​పై చర్యలు తీసుకోవడంలో తమిళనాడు ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని లేఖలో సంతకం చేసిన దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్​ఎన్​ ధింగ్రా ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని సుప్రీం కోర్టును కోరారు. న్యాయాన్ని కాపాడేందుకు తమ అభ్యర్థనను స్వీకరిస్తారని ఆశిస్తున్నట్లు అందులో చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news