నకిలీ వార్తలు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు ఎన్నో నకిలీ వార్తలని తరచూ మనకు సోషల్ మీడియాలో కనబడుతూ ఉంటాయి. నకిలీ వార్తలని గుర్తుపట్టడం కష్టమే. చాలా మంది నకిలీ వార్తలని నిజమని భావిస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చింది మరి అది నిజమా కాదా అందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ మొత్తం పూర్తిగా ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ని క్లోజ్ చేసేసారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి నిజంగా ఫుడ్ డెలివరీ సర్వీసెస్ ని ఢిల్లీలో సెప్టెంబర్ 8 నుండి 10 వరకు క్లోజ్ చేసేసారా..?
Food delivery services barred in entire Delhi from 8-10 Sept 2023❓#PIBFactCheck
– This is #Misleading
– Vehicles carrying essential items like milk, vegetables, fruits etc are permissible while other delivery services will be restricted in New Delhi district controlled zone pic.twitter.com/ugpooZL7TR
— PIB Fact Check (@PIBFactCheck) September 5, 2023
ఈ వార్త లో నిజం ఏంటి అనేది చూస్తే.. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది కొన్ని న్యూస్ వెబ్సైట్లు వార్తని తప్పు త్రోవ పట్టిస్తున్నారు. ఢిల్లీలో ఈ నెల 8 నుండి 10 వరకు ఫుడ్ సర్వీసెస్ లని క్లోజ్ చేసేస్తున్నారు అన్నది వట్టి నకిలీ వార్త మాత్రమే కనుక దీనిని అనవసరంగా ఇతరులతో పంచుకోవడం నమ్మడం మంచిది కాదు.