కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. దేశంలో కరోనా పరిస్థితిలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.
కరోనా విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఆసుపత్రుల్లో మాకు డ్రిల్స్ నిర్వహించాలని స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా కేసులపై సర్వెలెన్స్ పెంచాలని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. కరోనా పరిస్థితిలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని వివరించింది.
ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని ఆసుపత్రిలో కరోనా ప్రిపరేషన్ పై మాకు డ్రిల్స్ నిర్వహించాలి… అన్ని రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని వివరించింది కేంద్ర ఆరోగ్య శాఖ. హెల్త్ ను రాజకీయ అంశంగా చూడొద్దని కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ.