- తెరుచుకోనున్న స్విమ్మింగ్ పూల్స్
- సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం పెంచుకోవచ్చు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ.. వైరస్ కట్టడి చేయడానికి ప్రభుత్వం టీకాను ప్రజలకు అందుబాటులోకి తీసుకుచ్చింది. దీనిలో భాగంగా తొలి విడుతలో మూడు కోట్ల మందికి టీకాను అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 మార్గదర్శకాలను తాజాగా మరోసారి సవరిస్తూ..పలు సడలింపులు ఇచ్చింది.
దీనిలో భాగంగా ఇప్పటివరకు ఉన్న పలు ఆంక్షలను సడలించింది. కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు దశలవారీగా సడలింపుల్లో తాజాగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలను ఫిబ్రవరి 1 నుంచి అనుమతిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే, దేశంలోని స్విమ్మింగ్ పూల్స్‌ను తెరిచేందుకు అనుమతించింది. ఇక సినిమా థియేటర్లలో సీటింగ్ సామర్థ్యం పెంచుకునేందుకూ అనుమతి తెలిపింది. గతంలో 50 శాతం సీటింగ్ సమార్థ్యం థియేటర్లను అనుమతించిన ప్రభుత్వం తాజాగా సీట్ల సామర్థ్యం పెంచుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కంటైన్‌మెంట్ జోన్‌ల వెలుపలి అన్ని కార్యకలాపాలకూ అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. ఇక మిగతా అంశాలకు సంబంధించి గతంలో ఉన్న కరోనా నిబంధనలే ఫిబ్రవరి నెలాఖరు వరకు అమల్లో ఉంటాయని తెలిపింది.