పీవోకే త్వరలోనే భారత్‌లో కలుస్తుంది.. కేంద్ర మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్‌ పాక్ ఆక్రమిత కశ్మీర్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) భారత్‌లో తప్పకుండా కలుస్తుందని ఆయన అన్నారు. అయితే దానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. సోమవారం రోజున రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన పరివర్తన్‌ సంకల్ప్‌ యాత్ర కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పీవోకే తనంతట తానే భారత్‌లో విలీనం అవుతుందని వీకే సింగ్ అన్నారు. అయితే, దానికి కొంతకాలం పట్టవొచ్చని తెలిపారు. అదే విధంగా భారత్‌ అధ్యక్షతన జీ20 సదస్సు విజయం సాధించిందని వీకే సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ వేదికపై భారత్‌ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుందని కొనియాడారు.

మరోవైపు రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌పై వీకే సింగ్ విమర్శలు గుప్పించారు. శాంతి భద్రతలను కాపాడటంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలను భాజపా నేరుగా వినాలనుకుంటోందని.. అందుకే ఈ యాత్రను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. అందుకే తమతో కలిసి యాత్రలో పాల్గొంటున్నారని వీకే సింగ్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news