ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి యోగి ఆదిత్య నాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో ఉద్యోగులకు లంచ్ బ్రేక్ సమయాన్ని తగ్గించారు. ఇప్పటి వరకు అంచ్ బ్రేక్ సమయం ఒక గంట ఉండగా.. దాన్ని తాజా గా అరగంటకు తగ్గించారు. ఈ రోజు రాష్ట్రంలో టీం 9 అధికారులతో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్టు తెలిపారు.
అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల లంచ్ బ్రేక్ ను అరగంట తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. దీని వల్ల ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రజలకు సాయం చేసే సమయం ఇంకా పెరుగుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఉన్నాయని అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్లు అందజేస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రంలో 75 చెరువుల పూడికలను కూడా తీస్తామని ప్రకటించారు.