బీహార్‌లో కొత్త కూటమి..

-

బీహార్‌లో రాజకీయ వేడి రాజుకుంది. గెలుపే ల‌క్ష్యంగా పార్టీల‌న్నీ అస్త‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. నాయ‌కుల వ్యూహాలు, ప్ర‌తి వ్యూహాల‌తో పొలిటిక్ హీట్ పెరిగిపోయింది. బీహార్‌లో అక్టోబర్‌ 28న తొలి విడత పోలింగ్‌ జరుగనుంది. ఈనేపథ్యంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తామని మాజీ కేంద్ర మంత్రి, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నాయకుడు ఉపేంద్ర కుష్వాహ ప్రకటించారు. .. ఎన్డీఏ, ఆర్జేడీ నాయకత్వంలోని కూటమికి సమాంతరంగా మరో కూటమిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ ఫ్రంట్‌లో మాయావతి నాయకత్వంలోని బహుజన్‌ సమాజ్‌పార్టీ భాగస్వామిగా ఉంటుందని కుష్వాహ చెప్పారు.

బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 28న తొలి విడత పోలింగ్‌ జరుగనుంది. నవంబర్‌ 3న రెండో విడత, నవంబర్‌ 7న మూడో దశ పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. బీజేపీ-జేడీయూ-ఎల్‌జేపీ కలిసి పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి బరిలోకి దిగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news