నెట్​, నీట్ వివాదాలతో UPSC అలర్ట్.. ఎగ్జామ్ హాల్స్​లో ఇక AI సీసీ కెమెరాలు

-

నెట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీక్ వ్యవహారాలు దేశవ్యా ప్తంగా పెనుదుమారం రేపాయి. ఈ నేపథ్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) అప్రమత్తమైంది. పరీక్షల్లో అవకతవకలకు తావులేకుండా చేయడానికి మరిన్ని పకడ్బందీ చర్యలను చేపట్టాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తమ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించే సెంటర్లలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సీసీటీవీ నిఘా వ్యవస్థను వినియోగించాలన్న నిర్ణయానికి వచ్చింది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నుంచి ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ తీసుకోవడం, అభ్యర్థుల ముఖ గుర్తింపు, ఈ-అడ్మిట్ కార్డ్‌ల క్యూఆర్ కోడ్ స్కానింగ్, లైవ్ ఏఐ బేస్డ్ సీసీటీవీ సర్వైలెన్స్ సర్వీస్‌లను ఇకపై వినియోగించేందుకు యూపీఎస్సీ రంగం సిద్ధం చేసింది. పరీక్షా కేంద్రాల్లో ఈ విధమైన అధునాతన నిఘా సేవలను అందించడానికి అనుభవం కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ జూన్ 3వ తేదీనే టెండరును విడుదల చేసింది. జులై 7న మధ్యాహ్నం 1 గంటలలోగా బిడ్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. అదే రోజున మధ్యాహ్నం 1.30 గంటలకు బిడ్లను తెరిచి, ఆయా సంస్థల అర్హత ప్రమాణాలను సరి చూస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news