షాకింగ్ : గల్వాన్‌లో 60 మంది చైనా సైనికులు మృతి..!

జూన్‌ 15న తూర్పు గాల్వ‌న్‌ లోయ‌ వద్ద ఉద్రిక్తతలు నెలకొనేలా చైనా బలగాలు దుందుడుకు చర్యలకు పాల్పడి 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హింసాత్మక ఘర్షణల్లో 60 మందికి పైగా చైనా సైనికులు మృతి చెందారని అమెరికాకు చెందిన న్యూస్ వీక్ వార్త పత్రిక సెప్టెంబర్‌ 11 న సంచలన కథనం ప్రచురించింది. అలాగే చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ దీన్ని అవమానంగా భావిస్తున్నారని పేర్కొంది. అదేవిధంగా భారత సరిహద్దులో చైనా సైన్యం విఫలమైన తర్వాత మరో దూకుడు చర్యకు చైనా సిద్ధమైందని తెలిపింది.

అలాగే గల్వాన్‌లో జరిగిన ఘర్షణలో భారత్‌కు చెందిన 20 మంది సైనికులు మరణించారని భారత ప్రభుత్వం వెల్లడించింది. చైనా పీఎల్‌ఏ ఎందుకు వెల్లడించలేదు అని న్యూస్ వీక్ ప్రశ్నించింది. గల్వాన్‌లో భారత్-చైనా మధ్య జరిగిన ఘర్షణ 40 ఏళ్ల తరువాత మొదటి ప్రమాదకరమైన ఘర్షణ ఇదే. అలాగే 50 ఏళ్లలో తొలిసారి భారత్‌ దూకుడు వైఖరిని ప్రదర్శించిందని న్యూస్ వీక్ కథనం పేర్కొంది.