అమెరికా వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి అలెర్ట్. దేశవ్యాప్తంగా వీసా సేవలను ఈ నెల 28వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తెలిపింది. ఈ సేవలు అందించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యవస్థను మరింత అధునాతనంగా మార్పు చేసేందుకు బుధవారం నుంచి శుక్రవారం వరకు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ట్వీట్ చేసింది. దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పింది.
వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్స్ తదితర సేవలు శనివారం నుంచి అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ ప్రకటించింది. కస్టమర్ సర్వీస్ ఈ-మెయిల్ ఐడీ కూడా మారుతుందని పేర్కొంది. శనివారం నుంచి [email protected] ద్వారా సంప్రదించవచ్చని.. మార్పులకు సంబంధించిన మరింత సమాచారం కోసం USTravelDocs వెబ్‌సైట్‌ను చూడవచ్చు అని పేర్కొంది. శనివారంలోగా అత్యవసరంగా వీసాలు, ఇతర సేవలు కావాల్సిన వారు Hydcons [email protected] లేదా [email protected] సంప్రదించవచ్చని అమెరికన్ కాన్సులేట్ ట్వీట్‌లో పేర్కొంది.