ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న కే. లక్ష్మణ్

-

రాజ్యసభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ నుంచి మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించింది. యూపీ నుంచి మిథిలేష్ కుమార్, డా.కే. లక్ష్మణ్ లను పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.బిజెపి రాష్ట్ర సీనియర్ నేత, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే. లక్ష్మణ్ ని రాజ్యసభ బరిలోకి దింపింది. మొత్తం తొమ్మిది రాష్ట్రాల నుంచి పార్టీ 18 మంది రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ఆదివారం ప్రకటించింది. రెండో జాబితాలో నలుగురు పేర్లు విడుదల చేసింది. అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం ఉదయం లక్ష్మణ్ లక్నో వెళ్లనున్నారు.

మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు ఉదయం 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. యూపీ తో పాటు కర్ణాటక నుంచి లాహోర్ సింగ్ సిరోయా, మధ్యప్రదేశ్ నుంచి సుమృతా వాల్మీకి లకు కూడా అవకాశం కల్పించారు. గతంలో యూపీ జాబితాను విడుదల చేస్తూ ఆ పార్టీ ఆరుగురు పేర్లను ప్రకటించింది. ఆ జాబితాలో యూపీ నుంచి లక్ష్మీకాంత్ వాజపేయి, రాధామోహన్ అగర్వాల్ సహా ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. దీంతో పాటు ఇద్దరు మహిళలను కూడా రాజ్యసభకు పంపేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news