కరోనా వైరస్ వ్యాప్తి గత కొద్ది రోజుల నుంచి ఉధృతంగా ఉంది. ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు అలాగే పలువురికి బూస్టర్ డోసు పంపిణీ చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది మొదటి నుంచే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేస్తున్నారు. కాగ గత కొద్ది రోజుల నుంచి దేశంలో 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఈ ఏడాది మార్చి నెల నుంచి దేశ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల వయస్సు ఉన్న వారికి టీకాలు పంపిణీ చేస్తున్నారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి. ఈ వార్తలలో ఎలాంటి వాస్తవాలు లేవని కొట్టిపారేశాయి. ఇప్పుడే.. 12 నుంచి 14 ఏజ్ గ్రూప్ చిన్నారులకు వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని కేంద్ర వైద్య శాఖ భావించడం లేదని తెల్చి చెప్పింది. అలాగే దీని పై ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.