వచ్చే ఏడాది తొలి రోజు అంటే 2021 జనవరి 1 నుంచి కొత్త మోటార్ వాహన చట్టం అమలు లోకి రానుంది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేకుండా రోడ్డు ఎక్కితే ఈ కొత్త మోటారు వాహనాలు చట్టం ప్రకారం నూతన సంవత్సరం ఆరంభం నుంచే కఠిన చర్యలు తీసుకుంటామని కొద్ది రోజుల నుండీ ప్రకటనలు చేస్తూనే ఉంది. అలాంటి వారికి భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. అయితే ఈ అంశంలో ఒక ఊరట కల్పిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, అలానే వాహనాల ధ్రువీకరణ పత్రాల క్రమబద్దీకరణ డేట్‌ను మరో సారి పొడిగించింది. 2021 మార్చి 31లోగా క్రమబద్దీకరించుకోవచ్చునని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ కారణంగా లైసెన్స్ రెన్యువల్, ఇతర పనులు చేసుకోలేకపోయిన వారికి కేంద్రం ఈ అవకాశం ఇచ్చింది. నిన్న ఈ డెడ్‌లైన్‌ను ఇప్పటికే పలుమార్లు పొడిగిస్తూ వచ్చింది.