ప్రపంచ రికార్డు సృష్టించిన భారత అథ్లెట్.. ఎవరంటే?

-

టోక్యో పారాలింపిక్స్‌లో పురుషుల జావెలిన్ త్రో (ఎఫ్ 64) ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించి, భారత అథ్లెట్ సుమిత్ ఆంటిల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఏకంగా మూడు సార్లు అనగా హ్యాట్రిక్ రికార్డు క్రియేట్ చేశాడు సుమిత్. జపాన్‌లో జరిగిన ఫైనల్‌ పోటీల్లో 68.55 మీటర్ల అత్యుత్తమ త్రో విసిరి భారత పతకాల సంఖ్యను ఏడుకు చేర్చాడు. భారత్ తరఫున పారాలింపిక్స్‌లో పార్టిసిపేట్ చేసిన క్రీడాకారులు మొత్తంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారనే చెప్పొచ్చు. సుమిత్ 66.95 మీటర్లు విసిరి రౌండ్ 1 తర్వాత అగ్రస్థానంలో నిలిచి కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. తన రెండవ ప్రయత్నంలో 68.08మీ. త్రో తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

Sumit Antil

మునుపటి ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. వరుసగా మూడో, నాల్గో త్రోలో అతడు 65.27 మీ. 66.71మీ. విసిరాడు. అయితే, సుమిత్ తన ఐదో ప్రయత్నంలో మూడో సారి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా గోల్డ్ మెడల్ సాధించింనందుకుగాను అథ్లెట్ సుమిత్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. వరల్డ్ రికార్డు బ్రేక్ చేసినందుకు హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలిపాడు సుమిత్. అయితే, ఇందుకుగాను తాను చాలా ప్రాక్టీస్ చేసినట్లు చెప్పుకొచ్చాడు సుమత్. ట్రైనింగ్ సమయంలో తాను 71 మీటర్లు, 72 మీటర్లు చాలా సార్లు త్రో చేశానని, కానీ, కాంపిటీషన్‌లో 68.55 మీటర్ల త్రో చేసినట్లు పేర్కొన్నాడు సుమిత్. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ దూరం త్రో వేసి మరిన్న పతకాలు సాధిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు సుమిత్. మొత్తంగా పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి పెట్టినందుకుగాను భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పార్టిసిపేట్ చేసి షూటర్ అవని లేఖారా పతకం తెచ్చిపెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news