వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గత ఐపీఎల్ నుంచి శత్రువులుగా మారిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆఫ్గాన్ బౌలర్ నవీన్ ఉల్హాక్ లు పరస్పరం అభినందించుకొని పలకరించుకున్నారు. నవ్వుతూ పలకరించుకోవడంతో ఫ్యాన్స్ సంబరపడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ సందర్భoగా నవీన్ ఉల్హాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ గొప్ప ఆటగాడు అని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్హాక్ అన్నారు. ‘కోహ్లీ, నేను మ్యాచ్ మధ్యలో కరచాలనం చేసుకున్నాం. బయట కానీ…మైదానంలో కానీ ఏం జరిగినా ఇంతటితో వదిలేద్దాం అని కోహ్లీతో చెప్పాను’ అని నవీన్ తెలిపారు. గత ఐపీఎల్ నుంచి కోహ్లీ, నవీన్ మధ్య వైరం నడుస్తోంది. ప్రపంచంలో నవీన్ ఎక్కడ క్రికెట్ ఆడుతున్న కోహ్లీ… కోహ్లీ అంటూ ఫ్యాన్స్ అతడిని ఆటపట్టిస్తున్నారు.