BJPపై నిందలు వేసేవారు సమాధానం చెప్పాలని ఫైర్ అయ్యారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలను అమిత్ షాకు నారా లోకేష్ వివరించారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. ‘కేంద్రంపై నిందలు వేసేవారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. సిబిఎన్ అరెస్ట్ వెనుక బిజెపి హస్తం ఉంటే లోకేష్ కు అమిత్ షా ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తారు’ అని ఆమె X( ట్విటర్) లో ప్రశ్నించారు.
కాగా, షాతో లోకేష్ భేటిలో… ఏపీ, టీఎస్, బిజెపి అధ్యక్షులు పురందేశ్వరి, కిషన్ రెడ్డిపాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా బుధవారం రోజున మరోసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను నారా లోకేశ్ కలిశారు. ఏపీ సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. చంద్రబాబుపై కేసులు, ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి లోకేశ్ షాకు వివరించినట్లు సమాచారం.
https://x.com/PurandeswariBJP/status/1712155082819850677?s=20