దేశంలో 100 ఏళ్లు దాటిన వయోవృద్ధ ఓటర్లు ఎంత మంది ఉన్నారో తెలుసా..?

-

స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఒకరైన శ్యాం శరణ్‌ నేగీ వారం రోజుల క్రితం మరణించారు. 106 ఏళ్ల వయస్సు కలిగిన ఆయన తుదిశ్వాస విడవడానికి మూడు రోజుల ముందు చివరిసారిగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. నేగీలాగే దేశంలో ప్రస్తుతం చాలా మంది వృద్ధ ఓటర్లు ఉన్నారు. వారిలో 100 ఏళ్లు దాటిన వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం భారత్‌లో వందేళ్లు దాటిన శతాధిక వయోవృద్ధులు సుమారు 2.5 లక్షల మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం ఓటర్ల జాబితాలో 2,55,598 మంది శతాధిక వృద్ధులు ఉడటం గమనార్హం.

ఇక 80 ఏళ్లకు పైబడిన వారిలో 1,83,53,347 మంది ఓట్లరు ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు గల ఓటర్లు 1,52,34,341 మంది ఉండగా, 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన 20,06,65,436 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news