IPl 2023 : SRHకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం

-

SRHకు బిగ్ షాక్. SRH జట్టుకు కీలక ఆటగాడు అయిన వాషింగ్టన్ సుందర్ ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గాయం కారణంగా రానున్న అన్ని మ్యాచ్లకు సుందర్ అందుబాటులో ఉండడని SRH వెల్లడించింది. సుందర్ త్వరలో కోలుకోవాలని ఆశిస్తున్నామని తెలిపింది. కాగా, ఇప్పటికే వరుస ఓటములు ఎదుర్కొంటున్న SRH కు సుందర్ దూరం కావడంతో ఎదురు దెబ్బ తగిలినట్లు అయింది.

కాగా, IPL లో చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సంజు శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. అయితే ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news