Wayanad BJP MP Candidate Navya Haridas: వయనాడ్ బీజేపీ ఎంపీ అభ్యర్థి నవ్య హరిదాస్ ఫైనల్ అయ్యారు. 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కోజికోడ్ సౌత్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు నవ్య హరిదాస్. ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న నవ్య హరిదాస్… 2007లో బీటెక్ పూర్తి చేసి మెకానికల్ ఇంజనీర్ గా కొన్నేళ్లు ఉద్యోగం చేశారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరారు నవ్య హరిదాస్.

2024 ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ ఎంపీగా రాహుల్ గాంధీ గెలు పొందారు. అయితే.. సిట్టింగ్ రాహుల్ గాంధీ స్థానాన్ని వదులుకోవడంలో వయనాడ్ కు బైపోల్ వచ్చింది. ఉప ఎన్నికలో వయనాడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు ప్రియాంక గాంధీ. దీంతో వయనాడ్ ఎంపీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. మరి ఇలాంటి ఉప ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుస్తారో చూడాలి.