AP: కూటమి సర్కార్ లో కలకలం చోటు చేసుకుంది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానంపై కేసు నమోదు అయింది. ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానంపై తిరుమలలో కేసు నమోదు చేసారు. బ్రేక్ దర్శనం కోసం బెంగుళూరుకు చెందిన శశికుమార్ నుంచి 65 వేలు తీసుకుని మోసం చేశారని ఆరోపణలు వచ్చాయి.

ఎంఎల్సీ జకియా ఖానంతో పాటు చంద్ర శేఖర్, అమె పీఏ కృష్ణ తేజాపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక సన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానంపై కేసు నమోదు గురించి వివరాలు తెలియాల్సి ఉంది.