దేశ శత్రువులకు తగిన సమాధానం చెప్పాం : రాజ్ నాథ్ సింగ్

-

భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఆపరేషన్ సింధూర్ ద్వారా దేశ శత్రువులకు తగిన సమాధానం చెప్పామని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. తాజాగా ఢిల్లీలో ఆయన మీడియా సమావేశంలో ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు.  అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు నిర్వహించామని.. భారత సైన్యం తన సత్తా చాటింది. అమాయకులను చంపిన వారినే మేము చంపామని తెలిపారు.  పౌరులకు ఎలాంటి నస్టం లేకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామని తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు మూల్యం చెల్లించుకున్నారని పేర్కొన్నారు మంత్రి రాజ్ నాథ్ సింగ్. 

అశోకవనాన్ని హనుమాన్ ఏవిధంగా ధ్వంసం చేశాడో.. తాము కూడా అలాగే ఆపరేషన్ చేటపట్టామని వివరించారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తే.. ఎట్టి పరిస్థితుల్లో సహించం అని హెచ్చరించారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం తమ సత్తా ఏంటో చూపించింది. రైట్ టూ రెస్పాండ్ హక్కు ను వాడుకున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news