రేషన్‌ స్కామ్​లో బంగాల్​ మంత్రి అరెస్ట్​

-

పశ్చిమ బెంగాల్​లో రేషన్‌ పంపిణీ స్కామ్​కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో తాజాగా బంగాల్ అటవీ శాఖ మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్​ను అరెస్టు చేసింది. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఇవాళ తెల్లవారుజామున అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయణ్ను స్థానిక కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. మరోవైపు తనకు వ్యతిరేకంగా జరిగిన భారీకుట్రలో తాను బాధితుడినంటూ అరెస్ట్‌ తర్వాత మంత్రి జ్యోతిప్రియ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతిప్రియోకు ఈడీ విచారణలో ఏదైనా జరిగితే అధికారులే బాధ్యత వహించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హెచ్చరించారు.

ఈ కేసుతో సంబంధమున్న వ్యాపారవేత్త బాకీబుర్ రెహమాన్‌తో కూడా జ్యోతిప్రియో మల్లిక్‌కు ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతవారం బాకీబుర్ రెహమాన్‌ను కైఖలిలోని అతడి ఫ్లాట్‌లో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక గురువారం రోజున మంత్రి జ్యోతిప్రియ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news