నేడు కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటన చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను AICC ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. నేడు ఉదయం 10 గంటలకు ఒక కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ జరగనుండగా, అభ్యర్థులను ఖరారు చేసి… రెండో జాబితాను ప్రకటించనున్నట్లు సమాచారం.

సీట్ల అంశంపై ఇప్పటికే ఖమ్మం జిల్లా నేతలతో అధిష్టానం ప్రత్యేకంగా చర్చించినట్లు తెలుస్తోంది. కాగా, తొలి జాబితాలు 55 స్థానాలకు AICC అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరారు. దిల్లీలో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీయే బలంగా కనిపిస్తోందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందువల్లే తాను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని.. అంతే కానీ పదవుల కోసం కాదని స్పష్టం చేశారు.