మొబైల్ వాడుతున్న ప్రతి ఒక్కరు వాట్సప్ వాడుతారు అన్న సంగతి తెలిసిందే. వాట్సప్ ద్వారా మనం ఎలాంటి సమాచారం అయినా సరే… చాలా సులభంగా పంపించుకోవచ్చు. ప్రాంతంతో సంబంధం లేకుండా… ఫొటోస్ అలాగే వీడియోస్ వాటిని మనం పంపించుకోవచ్చు. అయితే వాట్సప్… నుంచి రోజుకు ఒక ఫీచర్ లాంచ్ అవుతూనే ఉంది.
అయితే తాజాగా సరికొత్త ప్రకటన చేసింది వాట్స్అప్. తాజాగా స్టేటస్ అప్డేట్ ఫ్యూచర్ ను అప్డేట్ చేసింది. దీని ద్వారా యూజర్లు లాంగ్ వాయిస్ నోట్లను పోస్ట్ చేయడానికి వీలు ఉంటుందన్నమాట. ఒక్క నిమిషం నిడివి గల వాయిస్ నోట్ లను మనం స్టేటస్ లో అప్డేట్ చేసుకోవచ్చన్నమాట. ఇప్పటివరకు ఈ ఆప్షన్ లేదు. కానీ ఇకనుంచి ఈ ఆప్షన్ ఉండబోతుంది అన్నమాట.
వాట్సప్ కొత్త వర్షన్ను అప్డేట్ చేసిన యూజర్లకు ఇప్పుడు తమ స్టేటస్ అప్డేట్ల ద్వారా ఎక్కువ నిడివి కలిగిన ఆడియో మెసేజ్లను రికార్డు చేసుకోవచ్చు అలాగే షేర్ చేసుకోవచ్చును. వాట్సప్ స్టేటస్ లో పొడవైన వీడియోలను పోస్ట్ చేయడం కుదిరేది కాదు. కానీ ఇకనుంచి 60 సెకండ్ల పాటు… స్టేటస్ పెట్టుకోవడమే కాకుండా… వాయిస్ నోట్ లను కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే 60 సెకన్ల వరకు వీడియోలు, ఆడియో క్లిప్‌లను మనం షేర్ చేయవచ్చు అన్న మాట.