పచ్చని కాపురంలో చిచ్చుపెట్టిన ‘టమాట’

-

టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు ధరలు పెరుగతూ సామాన్యుడికి మంట పెడుతున్నాయి. ఈ క్రమంలోనే టమాట ధరలకు సంబంధించి విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలే టమాటల వ్యాపారి బౌన్సర్లను నియమించుకున్న విషయం గురించి చదివాం. ఇక తాజాగా ఈ టమాట ఓ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిన సంఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది.

ధర విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సందీప్‌ బుర్మన్‌ అనే వ్యక్తి కూరలో 2 టమాటలను వేశాడు. అంతే.. ఖర్చు ఎందుకు పెడుతున్నావంటూ అతని భార్య ఆర్తి బుర్మన్‌ ఘర్షణకు దిగింది. మాటా మాటా పెరిగి.. ఆర్తి బుర్మన్‌ భర్తను విడిచి వెళ్లిపోయింది. ఆమెతో పాటు కుమార్తెను తీసుకెళ్లింది. 3 రోజులైనా భార్య జాడ తెలియకపోవడంతో సందీప్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలిసిన వారింట్లో గాలించాడు. భార్యాబిడ్డల ఫొటోలతో రహదారులపై విచారించాడు. ఎట్టకేలకు ఆమె ఆచూకీని పోలీసులు గుర్తించారు. ఉమారియాలోని తన సోదరి ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. టమాటాలు కూరలో వేసినందుకే మనస్తాపం చెంది ఆమె వెళ్లిపోయినట్లు నిర్ధరించారు. వారిద్దరు మాట్లాడుకునే ఏర్పాట్లు చేశామని.. త్వరలోనే ఆమె ఇంటికి వెళ్లేలా చేస్తామని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news