పీఎం ఎవరో చెప్పలేకపోయాడని పెళ్లి రద్దు చేసిన యువతి.. ఆపై…

-

యూపీలోని ఘాజీపుర్‌ జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. జూన్ 12వ తేదీన జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జరిగిన పెళ్లిని కాదని.. పెళ్లికొడుకు తమ్ముడిని ఓ యువతి వివాహం చేసుకుంది. దానికి గల కారణం తెలిసి అందరూ షాక్ అయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

వరుడు.. దేశ ప్రధాని పేరు చెప్పలేదనే కారణంతో వధువు అక్కడికక్కడే అతడి తమ్ముడిని వివాహం చేసుకున్న ఘటన యూపీలో చోటుచేసుకుంది. శివశంకర్‌ (27)కు రంజనతో  ఆరు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. జూన్‌ 11న వివాహం జరిగింది.  జూన్‌ 12న ఉదయం.. పెళ్లివేడుకలో భాగంగా వధువు ఇంట్లో ఓ చిన్న కార్యక్రమం జరిగింది. ఆ సమయంలో శివశంకర్‌ తన మరదలు, బావమరిదితో సరదాగా మాటలు కలిపాడు. ఉన్నట్టుండి దేశ ప్రధాని ఎవరని మరదలు వేసిన ప్రశ్నకు శివశంకర్‌ సమాధానం చెప్పలేకపోయాడు. ఇది చూసిన వధువు బంధువులు అతణ్ని హేళన చేశారు. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన వధువు.. శివశంకర్‌ తమ్ముడైన అనంత్‌ను అక్కడికక్కడే మరో పెళ్లి చేసుకుంది. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news