‘తెలంగాణ అమరవీరుల స్మారకం’ ప్రత్యేకతలు ఇవే

-

తెలంగాణ సాధించుకునే ప్రక్రియలో అమరులైన వారి గుర్తుగా అమరవీరుల స్మారక కేంద్రం నిర్మించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. 2017 జూన్‌లో శంకుస్థాపన చేసిన ఈ స్మారక చిహ్నం ఎట్టకేలకు ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. దుబాయ్‌ ‘మ్యూజియం ఆఫ్‌ ది ఫ్యూచర్‌’ను నిర్మించిన సంస్థతో సంప్రదింపులు జరిపి నిర్మాణాన్ని రూ.178 కోట్లతో పూర్తిచేశారు. తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వారి జ్ఞాపకంగా, సాంస్కృతిక కేంద్రంగా దాన్ని రూపొందించారు. ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్మారక చిహ్నాన్ని ప్రారంభించనున్నారు.

తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రత్యేకతలు ఇవే..

  • మొదటి రెండు బేస్‌మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని పార్కింగ్‌ కోసం కేటాయించారు.
  • గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పుస్తక ప్రదర్శన, ఇతర ఎగ్జిబిషన్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించారు.
  • మొదటి అంతస్తులో అమరుల ఫొటో గ్యాలరీతోపాటు 70 మంది కూర్చునేందుకు వీలుగా థియేటర్‌ నిర్మించారు.
  • రెండో అంతస్తులో 500 మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్‌ సెంటర్‌ ఉంది.
  • మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో, టెర్రస్‌పైన అద్దాల పైకప్పుతో రెస్టారెంటును ఏర్పాటు చేశారు.
  • దీపం ఆకృతిలో రూపుదిద్దుకున్న నిర్మాణానికి ఎలాంటి అతుకులు కనిపించకుండా ప్రత్యేక స్టీలును ఉపయోగించారు.
  • పర్యాటకులు, అతిథులకు అతిథ్యమిచ్చేలా మూడో అంతస్తులో ఒకటి, టెర్రస్‌పై ఒకటి ఇలా రెండు రెస్టారెంట్లు సిద్ధంచేశారు.
  • తెలంగాణ సాధన ఎలా చరిత్ర సృష్టించిందో ఈ ప్రత్యేక మిర్రర్‌ ఇమేజ్‌ స్టీలు నిర్మాణం కూడా చరిత్రలో నిలవనుంది.

Read more RELATED
Recommended to you

Latest news