మోదీ ప్రమాణ స్వీకారానికి విదేశీ ప్రముఖులకు ఆహ్వానం

-

భారతదేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధం అవుతోంది. ఈ నెల 8వ తేదీన మోదీ ప్రధానిగా స్వీకారం చేయనున్నారు. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఈ వేడుకకు ఆహ్వానించే వారి జాబితా కూడా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశంలో అగ్రనేతలతో పాటు విదేశీ నాయకులను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది.

శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్‌ దేశాల అగ్రనేతలను రావాలని కోరనున్నట్లు సమాచారం. మోదీ ప్రమాణ స్వీకారానికి తమకు ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే మీడియా కార్యాలయం తెలిపింది. విక్రమసింఘే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారని స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపినట్లు కూడా వెల్లడించింది. మరోవైపు బంగ్లాదేశ్ ప్రధాని షేక్‌ హసీనాకు మోదీ ఫోన్‌ చేసి ఆహ్వానించగా ఆమె వస్తానని చెప్పినట్లు తెలిసింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్‌ దహల్‌ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, మారిషస్ ప్రధానమంత్రి పర్వింద్ జుగ్నౌత్‌ను.. మోదీ ప్రమాణస్వీకారానికి రావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news