బీజేపీ మాస్టర్ ప్లాన్..అయోధ్య నుండి బరిలోకి యోగీ..!

-

త్వరలో జరుగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే యూపీలో పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంగతి తెలిసిందే. దాంతో బిజెపి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈసారి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అయోధ్య నుండి బరిలోకి దింపాలని బిజెపి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం యోగి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే రామ మందిరం నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో యోగి అక్కడ నుండి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని అధిష్ఠానం భావిస్తోంది. అయోధ్య అయితే కచ్చితంగా యోగి ఆదిత్యనాథ్ మెజారిటీ తో గెలిచే అవకాశాలు ఉంటాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో యోగి ఆదిత్యనాథ్ గోరక్ పూర్ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇదిలా ఉంటే యోగి ఆదిత్యనాథ్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతో యూపీ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version