మోదీ కేబినెట్లో అతిపిన్న వయస్కుడిగా తెలుగు ఎంపీ.. మరి పెద్దాయన ఎవరంటే?

-

కొత్తగా కొలువుదీరిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్లో 33మంది కొత్తవారు ఉన్నారు. అందులో ఆరుగురికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చేరినవారిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), హెచ్‌డీ కుమారస్వామి (కర్ణాటక) ఉన్నారు. కొత్తగా కేబినెట్లో చేరిన వారిలో బీజేపీ మిత్రపక్షాలకు చెందిన ఏడుగురు నేతలు ఉన్నారు.

కొత్త కేబినెట్లో అతిపిన్న వయస్కుడిగా టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు(36) నిలిచారు. ఆయన తర్వాత మహారాష్ట్ర బీజేపీ నేత రక్షా నిఖిల్ ఖడ్సే(37), లోక్ జన్శక్తి పార్టీ(ఎల్జేపీ) ఎంపీ చిరాగ్ పాసవాన్(41), రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) ఎంపీ జయంత్ చౌదరి(45) అతి పిన్న వయస్కులుగా ఉన్నారు. మరోవైపు అతి పెద్ద వయస్కుడిగా బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్థానీ ఆవామ్ మోర్చా(హెచ్ఏఎమ్) వ్యవస్థాపక అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ(79) ఉన్నారు. మరోవైపు మోదీ 2.0 సర్కారులో పనిచేసిన మంత్రుల్లో 37 మందికి ప్రస్తుతం కేంద్ర కేబినెట్లో దక్కలేదు. వారిలో ఏడుగురు క్యాబినెట్‌ ర్యాంకు మంత్రులు ఉండగా, మిగిలిన 30మంది సహాయమంత్రులు.

Read more RELATED
Recommended to you

Latest news